కార్బన్ పన్ను గురించి వివరణ తెలుగులో

కార్బన్ పన్ను అనేది కార్బన్‌ను (ఉదా: బొగ్గుపులుసు) ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలపై విధించే పన్ను.

28 ఆగస్టు, 2024
కార్బన్ పన్ను గురించి వివరణ | Carbon Tax
కర్బన పన్ను

శిలాజ ఇంధనాలను కాల్చడం నుండీ, పరిశ్రమల నుండీ వెలువడే కార్బన్ ఉద్గారాల వల్ల వాతావరణంలో మార్పులు, పర్యావరణానికి చేటు జరుగుతుందని, ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని మనకు తెలిసినదే. కనుక కార్బన్ ఉద్గారాలపై నియంత్రణ చాలా అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని కార్బన్ పన్ను అనే అంశం పుట్టుకొచ్చింది. కార్బన్ పన్ను అనేది కార్బన్ ఉద్గారాలపై విధించే పన్ను.

కార్బన్ ఉద్గారాలు, వాటి దుష్ప్రభావాల వలన కలిగే సామాజిక వ్యయాలను గుర్తించి, వాటిపై నియంత్రణ చర్యలు చేప్పట్టే ఉద్దేశంతో కార్బన్ పన్ను విధించబతుంది. ఈ కార్బన్ పన్ను వలన శిలాజ ఇంధనాల ధరలు పెరుగుతాయి. ఆ విధంగా పరిశ్రమల దృష్టిని చవకైన కాలుష్యరహిత ప్రత్యామ్న్యాయాల వైపు మరల్చి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిండం చేతనవుతుంది.

కార్బన్ పన్ను గురించిన ముఖ్యమైన విషయాలు:

  1. కార్బన్ పన్ను అనేది ఒక రకమైన “కాలుష్య పన్ను”. ఇది వ్యాపారాలు, వ్యక్తులపై విధించే రుసుము. కార్బన్ పన్ను బొగ్గు, చమురు, గ్యాసోలిన్, సహజ వాయువుతో పాటుగా కార్బన్ ఆధారిత ఇంధనాలను కాల్చే సంస్థలపై విధించే రుసుము. కార్బన్ పన్నులు సాధారణంగా శిలాజ ఇంధనాల నుండి విడుదలయ్యే బొగ్గుపులుసును (Carbon dioxide) మాత్రమే గురి చేసుకొని విధింపబడతాయి.
  2. చట్టవిరుద్ధమైన, ఆలాగే, పునరుత్పాదన గుణం లేని ఇంధన వనరుల (బొగ్గు, చమురు వంటివి) నుండి వచ్చే శక్తిపై మనం ఆధారపడటాన్ని తగ్గించడానికి కార్బన్ పన్నులు రూపొందించబడ్డాయి. కార్బన్ పన్ను కారణంగా కార్బన్-ఉద్గార వస్తువుల ధరలు పెరుగుతాయి. దానివల్ల చవకైన కాలుష్యరహిత ప్రత్యామ్న్యాయాల వైపు సంస్థలు, వ్యక్తులు మర్లితే, ఆ ప్రత్యామ్న్యాయాల వాడుక పెరుగుతుంది. ఉదాహరణకు ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ పలకలు, గాలి టర్బైన్లు, వగైరా.
  3. ప్రస్తుతం చాలా దేశాల్లో కార్బన్ పన్ను వినియోగదారుల ప్రవర్తనపై గట్టి ప్రభావం చూపగలిగే స్థితిలో లేదు. దేశాలు మరింత అభివృద్ధి చెందే క్రమంలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పన్ను పెంచడంతో పాటు శిలాజ ఇంధనాల వాడకం తగ్గించేలా ప్రోత్సాహకాలు కూడా పెంచవచ్చు.
  4. ఏ దేశంలోనైనా కార్బన్ పన్నుల ప్రభావం నేరుగా ఇంధనం లేదా పెట్రోల్ ధరలపై పడుతుంది. రానున్న సంవత్సరాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతాయనేది ఒక అంచనా.
  5. కార్బన్ పన్నులను ఒల్లని పరిశ్రమలు, ఆ పన్నులు ఉండని చోట్లకూ, దేశాలకూ తరలివెళ్ళిపోయే అవకాశం లేకపోలేదు. దీనికి తోడుగా ఆ పన్నుపై పారిశ్రామికవేత్తల నుండీ, మధ్యతరగతి జనాల నుండీ తీవ్రమైన వ్యతిరేకత కూడా రావచ్చు.
  6. ఇలా పెట్రోల్ ధరల పెరుగుదల, ఆర్థికాభివృద్ధిలో అడ్డంకులు కలగడం, పరిశ్రమల స్థానభ్రంశం, వ్యతిరేక ఉద్యమాలు వంటివి కార్బన్ పన్ను యొక్క ప్రతికూల అంశాలు. కనుక ప్రస్తుతానికైతే అభివృద్ధి చెందని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కార్బన్ పన్ను విధించడం సరైన పద్ధతి కాకపోవచ్చు.
  7. ఆర్థికాభివృద్ధికి ఇది అడ్డంకి అయినప్పటికీ భారతదేశం వంటి దేశాలు సమతుల్య విధానాన్ని అనుసరించి కార్బన్ ఉద్గారాలపై “స్వచ్ఛమైన పర్యావరణం సెస్”ను (క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్, CEC) విధిస్తున్నాయి.

టూకీగా, కార్బన్ పన్ను అనేది కార్బన్ ఉద్గారాలపై విధించే పన్ను. ఇది శిలాజ ఇంధనాల ధరలను పెంచడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి రూపొందించబడింది. ఈ పన్నుల విధింపు ప్రపంచవ్యాప్తంగా అవలంబించబడుతోంది.

సంబంధిత పదాలు

Global Warming

గ్లోబల్ వార్మింగ్

గ్లోబల్ వార్మింగ్ మానవ కార్యకలాపాల, ముఖ్యంగా గ్రీన్హౌస్ వాయువుల భూమి యొక్క సగటు ఉపరితల ఉష్ణోగ్రతలో దీర్ఘకాలిక పెరుగుదలన.
Necrophagy

నెక్రోఫాగి

నెక్రోఫాగి అనేది కొన్ని జంతువులు లేదా జీవులు చనిపోయిన జీవులకు ఆహారం ఇవ్వడం.
Biodiversity

జీవవైవిధ్యం

జీవవైవిధ్యం అంటే భూమిపై ఉన్న జన్యువులు, జాతులు & పర్యావరణ వ్యవస్థల యొక్క వైవిధ్యం. ఇది గ్రహం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Mycorrhiza

మైకోరైజా

మైకోరైజా మొక్కల మూలాలు మరియు కొన్ని శిలీంధ్రాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహజీవన అనుబంధాన్ని సూచిస్తుంది.
Ecology

జీవావరణ శాస్త్రం

జీవావరణ శాస్త్రం అనేది జీవులు మరియు వాటి పర్యావరణం మధ్య సంబంధాలు మరియు పరస్పర చర్యల యొక్క శాస్త్రీయ అధ్యయనం.
Biome

బయోమ్

బయోమ్ అనేది మొక్కలు మరియు జంతువుల యొక్క పెద్ద-స్థాయి సంఘం, ఇది విభిన్నమైన ఆవాసాలను ఆక్రమిస్తుంది.
Carbon Footprint

కర్బన పాదముద్ర

కార్బన్ పాదముద్ర అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక సంస్థ విడుదల చేసే గ్రీన్‌హౌస్ వాయువుల మొత్తం మొత్తాన్ని సూచిస్తుంది.